
ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విశాఖపట్టణం విమానాశ్రయంలో జరిగిన దాడిపై టీడీపీ ఎంపీ కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ గత కొన్ని నెలలుగా రాష్ట్రమంతా తిరుగుతున్నారని, అప్పుడు జరగని దాడి ఇప్పుడెలా జరిగిందని ప్రశ్నించారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒకవేళ జగన్పై దాడి చేయాలనుకుంటే రోడ్డుపై ఎప్పుడో ఆయన ఖైమా అయిపోయి ఉండేవారన్నారు. రాజకీయ నేతలను హత్య చేయాలన్న ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు.
వైసీపీ అధినేత జగన్ తన ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఇప్పటికే మూడు వేల కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేశారని నాని గుర్తు చేశారు. జగన్పై దాడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం ఎంతమాత్రమూ లేదన్న ఆయన కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం (సీఐఎస్ఎఫ్) వైఫల్యం కారణంగా ఈ ఘటన జరిగిందన్నారు. ఓ వ్యక్తి దాడి చేయాలనుకుంటే అందుకు విమానాశ్రయాన్ని ఎంచుకోరని, రోడ్డుపై ఖైమా కింద కొట్టేస్తారని నాని వ్యాఖ్యానించారు. .
Be the first to comment