
తనను కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా స్వయంగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫోన్ చేసి అడిగారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. ఆయన వద్ద ఉంచేందుకు పలు ప్రతిపాదనలు ఉన్నాయని, ఆయన ప్రతిస్పందనను బట్టి తదుపరి నిర్ణయం ఉంటుందని కృష్ణయ్య పేర్కొన్నారు. బీసీలకు రిజర్వేషన్ సహా పలు కీలక డిమాండ్లు ఉన్నట్టు చెప్పారు.
బీసీల కోసం రాజకీయ వేదిక ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారని కృష్ణయ్య పేర్కొన్నారు. వచ్చే లోక్సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల నాటికి సొంత పార్టీని ఏర్పాటు చేసి బరిలోకి దిగనున్నట్టు పేర్కొన్నారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటున్నాయని ఈ సందర్భంగా విమర్శించారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలకు 65 శాతం సీట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. లేదంటే వచ్చే ఎన్నికల్లో బీసీల సత్తా ఏంటో చవిచూస్తారని కృష్ణయ్య హెచ్చరించారు.
Be the first to comment