కూలిన విమానం… 189 మంది మృతి

జకార్తా: ఇండొనేషియా రాజధాని జకార్తా నుంచి పినాంగ్ వెళ్లే లయన్ ఎయిర్ ఫ్లైట్ కూలిపోయింది. బయలుదేరిన 13 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. అనంతరం విమానం జావా సముద్రంలో కూలిపోయింది.

విమానంలో సిబ్బంది సహా మొత్తం 189 మంది ఉన్నారు. అందరూ చనిపోయారని లయన్ విమాన సంస్థ తెలియజేసింది. జావా సముద్రంలో విమాన శకలాలు లభ్యమయ్యాయి. తమ వారిని పోగొట్టుకున్న వారు దు:ఖ సాగరంలో మునిగిపోయారు.

ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*