తెలంగాణలో సర్వే చేస్తూ పట్టుబడిన ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులు.. కేటీఆర్ గుస్సా

తెలంగాణలో రహస్య సర్వే నిర్వహిస్తున్న ముగ్గురు ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకుని, ఆపై వదిలిపెట్టారు. ఈ నెల 26న జగిత్యాల జిల్లా ధర్మపురిలో పర్యటించిన ముగ్గురు ఏపీ పోలీసులు రహస్యంగా సర్వే నిర్వహించారు. రానున్న ఎన్నికల్లో ఈ నియోకవర్గంలో ఏ పార్టీ విజయం సాధిస్తుంది? అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయంటూ స్థానికులను అడుగుతుండడంతో అనుమానం వచ్చిన వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని ప్రశ్నించారు. అయితే, పొంతనలేని సమాధానాలు చెబుతుండడంతో వారిని అదుపులోకి తీసుకున్నారు.

ఐడీ కార్డుల ఆధారంగా వారు ఆంధ్రప్రదేశ్‌ ఇంటెలిజెన్స్‌ పోలీసులని గుర్తించి ఎస్పీ సింధు శర్మ వద్దకు తీసుకెళ్లారు. ధర్మపురిలో వారిని అదుపులోకి తీసుకున్నామని, విచారణలో ఎటువంటి వివరాలు చెప్పలేదని, సర్వే కోసమే వారు వచ్చినట్టు గుర్తించామని జగిత్యాల డీఎస్పీ వెంకటరమణ పేర్కొన్నారు. కాగా, విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఇంటెలిజెన్స్ పోలీసులకు తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణలో ఏపీ పోలీసుల సర్వేపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌కు మంత్రి ఫిర్యాదు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*