జనసేన చీఫ్ పవన్‌పై విమర్శలు కురిపించిన సినీ నటుడు సుమన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ప్రముఖ సినీ నటుడు సుమన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. విశాఖపట్టణంలో కరాటే చాంపియన్‌షిప్ పోటీలను ప్రారంభించిన సుమన్ మీడియాతో మాట్లాడారు. నవ్యాంధ్రకు జీవనాడి లాంటి ప్రత్యేక హోదా విషయాన్ని పవన్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బోల్డంతమంది అభిమానులు, అనుచరగణం ఉన్న పవన్ పోరాడితే ప్రత్యేక హోదా వచ్చి తీరుతుందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీ వెళ్లి జంతర్‌మంత్ వద్ద ఆందోళన చేపట్టాలని సూచించారు.

తెలంగాణ రాజకీయాలపై సుమన్ మాట్లాడుతూ.. త్వరలో అక్కడ జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తన మద్దతు టీఆర్ఎస్ పార్టీకేనని స్పష్టం చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందిదని, రానున్న ఎన్నికల్లో మళ్లీ కేసీఆరే గెలవాలని తాను కోరుకుంటున్నట్టు సుమన్ పేర్కొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*