వినియోగదారులకు ఎయిర్‌టెల్ షాక్.. రూ.99 రీచార్జ్ ప్యాక్‌ సవరణ

తమ ఖాతాదారులకు ఎయిర్‌టెల్ షాకిచ్చింది. ఈ ఏడాది జూన్‌లో రూ.99 రీచార్జ్ ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 28 రోజల కాలపరిమితితో 2జీబీ డేటా లభించేది. ఇప్పుడీ ప్యాక్ ధరను పెంచి రూ.119 చేసింది. అయితే, డేటా ప్రయోజనాలలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ఈ ప్యాక్‌లో భాగంగా 28 రోజుల కాలపరిమితితో 2 జీబీ డేటా లభిస్తుండగా, కొందరు యూజర్లు తమకు 14 రోజుల కాలపరిమితితో 1జీబీ డేటా లభిస్తున్నట్టు చెబుతున్నారు. రూ.99 ప్లాన్‌ను ఎయిర్‌టెల్ డీలిస్ట్ చేసిప్పటికీ, ప్లాన్‌ను పది రోజుల కాలపరిమితితో 1జీబీ డేటాకు తగ్గించింది. గతంలో ఇదే ప్యాక్‌పై 28 రోజుల కాలపరిమితితో 2 జీబీ డేటా లభించేది.

రూ.119 ప్రీపెయిడ్ ప్లాన్ విషయానికొస్తే ఈ ప్లాన్ ఒక్కో సర్కిల్‌లో ఒక్కో ప్రయోజనాన్ని అందిస్తోంది. ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రం 2 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లను 28 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. కొందరు యూజర్లకు మాత్రం 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 300 ఎస్సెమ్మెస్‌లు 14 రోజుల కాలపరిమితితో అందిస్తున్నట్టు తెలిపింది. అయితే, వాయిస్ కాల్స్ విషయంలో ఎటువంటి ఎఫ్‌యూపీ నిబంధన లేదు. అయితే, 2 జీబీ డేటా ప్రయోజనాలు మాత్రం కొందరు యూజర్లకే అందుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*