
దసరా ఆఫర్ల హోరు ముగిసి రోజులైనా కాకముందే ఈ-కామర్స్ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్లు మరోమారు పోటాపోటీ ఆఫర్లకు సిద్ధమయ్యాయి. దీపావళి సేల్‌తో వినియోగదారుల చెంతకు వచ్చేస్తున్నాయి. ఫెస్టివ్ ధమకా డేస్ పేరుతో ప్లిప్‌కార్ట్ నవంబరు 1 నుంచి 5 వరకు సేల్ నిర్వహించనుండగా, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివ్ సేల్ పేరుతో నవంబరు 2 నుంచి 5 వరకు సేల్ నిర్వహిస్తోంది. రెండు సంస్థలు భారీ ఆఫర్లతో వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల విషయానికొస్తే..
నవంబరు ఒకటో తేదీ నుంచి ప్రారంభం కానున్న ఈ సేల్‌లో స్మార్ట్ఫోన్లు, వాటికి సంబంధించిన ఉత్పత్తులపై భారీ ఆఫర్లు ప్రకటించింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటి వరకు లిస్ట్ అయిన స్మార్ట్ఫోన్లలో రియల్ మీ 2 ప్రొ, రెడ్మీ నోట్ 5 ప్రొ, ఆనర్ 9 ఎన్ ఉన్నాయి. అలాగే, లెనోవో ఏ5, లెనోవో కె9 స్మార్ట్ఫోన్లు తొలిసారి విక్రయానికి రానున్నాయి. ఈసారి ఎస్బీఐతో ఒప్పందం కుదుర్చుకున్న ఫ్లిప్‌కార్ట్ క్రెడిట్ కార్డుతో జరిపే కొనుగోళ్లపై తక్షణ రాయితీలు ఇవ్వనుంది. దీంతోపాటు డెబిట్ కార్డు ఈఎంఐలు, ఫోన్‌పే క్యాష్ బ్యాక్, నోకాస్ట్ ఈఎంఐ వంటి వాటిని కూడా అందిస్తోంది.
అమెజాన్ ఆఫర్ల ఇలా ఉన్నాయి..
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ నవంబరు 2 నుంచి ప్రారంభం కాబోతోంది. నాలుగు రోజులపాటు నిర్వహించనున్న ఈ సేల్‌లో పలు ఉత్పత్తులపై భారీ రాయితీలు ప్రకటించింది. అలాగే, హెచ్డీఎఫ్సీ బ్యాంకుతో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఆ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డు వినియోగదారులకు 10 శాతం రాయితీలు ఇవ్వనుంది. రూ.2 వేల నుంచి రూ.4,999 మధ్య జరిపే కొనుగోళ్లపై అదనంగా 5 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది. రూ.5 వేల పైన కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. అమెజాన్ పే బ్యాలెన్స్ రూపంలో క్యాష్‌బ్యాక్ లభించనుంది.
ఈ సేల్‌లో వన్‌ప్లస్ 6టీ మొబైల్‌పై భారీ రాయితీలు ప్రకటించే అవకాశం ఉంది. నవంబరు 1 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. లాంచింగ్ ఆఫర్లో భాగంగా మరిన్ని రాయితీలు లభించనున్నాయి. అలాగే, నోకాస్ట్ ఈఎంఐ, కొత్త కస్టమర్లకు ఉచిత డెలివరీ, బుక్ మై షో, స్విగ్గీ వోచర్లు, అమెజాన్ పే బ్యాలెన్స్ వంటి ప్రయోజనాలు వినియోగదారులకు లభించనున్నాయి. అయితే, రూ.500 అంతకుమించి కొనుగోలు చేసే వారికి మాత్రమే ఇవి అందనున్నాయి. రెడ్మీ 6 ప్రొ, శాంసంగ్ గెలాక్సీ ఏ8ప్లస్, రియల్ మీ 1 వంటి వాటిపై ఆకర్షణీయమైన రాయితీలు లభించనున్నాయి. ఎక్స్చేంజ్ ఆఫర్లు, ఈఎంఐ ఆప్షన్లు మామూలే.
Be the first to comment