
విండీస్, ఆస్ట్రేలియాతో జరగనున్న టీ20 సిరీస్‌లకు ఎంపిక చేసిన భారత జట్టులో మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ పేరు లేకపోవడం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. రిషబ్ పంత్‌కు మార్గం సుగమం చేసే ఉద్దేశంతో సెలక్టర్లు ధోనీని పక్కనపెట్టారు. ధోనీ తన అద్భుత ఆటతీరుతో, కెప్టెన్సీతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్నాడు. అతడు చేసే పరుగులతో సంబంధం లేకుండా అభిమానులు ఎప్పుడూ అతడికి అండగా నిలుస్తూనే ఉన్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నైకి ప్రాతినిధ్యం వహిస్తున్న ధోనీని దాదాపు దేవుడిలా చూస్తున్నారు. ఇక, కోహ్లీ సేన గురువారం తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో విండీస్‌తో తలపడనుంది. చివరిదైన ఈ వన్డే ఇరు జట్లకు కీలకంగా మారింది. భారత్ గెలిస్తే సిరీస్ వశమవుతుంది. విండీస్ గెలిస్తే సమం అవుతుంది. ఈ నేపథ్యంలో అందరి దృష్టి ఈ వన్డేపై పడింది. అయితే, క్రికెట్ ప్రేమికుల దృష్టిని ధోనీ మరో విధంగా ఆకర్షిస్తున్నాడు. ‘ఆల్ కేరళ ధోనీ ఫ్యాన్స్ అసోసియేషన్’ మరో రకంగా తమ అభిమానాన్ని చాటుకుంది. గ్రీన్ ఫీల్డ్ స్టేడియం బయట ధోనీ 35 అడుగుల నిలువెత్త కటౌట్‌ను ఏర్పాటు ‘తలైవా’పై ఉన్న భక్తిని చాటుకుంది. కటౌట్ తయారీకి సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ తమ ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేసింది.
#Thala's Vishwaroopam getting ready at Trivandrum! #WhistlePodu #INDvWI ???????? #Yellove from @AKDFAOfficial! pic.twitter.com/AL8hxZ6DWz
— Chennai Super Kings (@ChennaiIPL) October 31, 2018
ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో ధోనీ ఫామ్ లేక తంటాలు పడుతున్నాడు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ కలిపి 50 పరుగలు చేయడానికి నానా అవస్థలు పడ్డాడు. అయితే, కీపర్‌గా మాత్రం దుమ్మురేపుతున్నాడు. నాలుగో వన్డేలో కీమోపాల్ను స్టంపౌట్ చేయడం చూసి క్రికెట్ ప్రపంచం నోరెళ్లబెట్టింది. 0.08 సెకన్లలోనే స్టంప్స్ పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. మూడో వన్డేలో పరిగెత్తి అందుకున్న క్యాచ్ హైలెట్. అయితే, టీ20 జట్టు నుంచి ధోనీని తొలగించడంపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సెలక్టర్ల తీరును పలువురు మాజీలు తప్పుబడుతున్నారు. ధోనీ ఆడితే జట్టుకే కాకుండా కెప్టెన్ కోహ్లీకి కూడా లాభమని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
Be the first to comment