డ్యూయల్ డిస్‌ప్లే..స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ.. 8జీబీ ర్యామ్‌తో వచ్చేసిన నుబియా ఎక్స్

జడ్‌టీఈ సబ్ బ్రాండ్ నుబియా గురువారం తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ మొబైల్ ‘నుబియా ఎక్స్’‌ను చైనాలో విడుదల చేసింది. 6.26 అంగుళాలు, 5.1 అంగుళాలు కలిగిన రెండు డిస్‌ప్లేలు ఈ ఫోన్‌లోని ప్రధాన ప్రత్యేకత. మిగతా స్పెసికేషన్ల విషయానికి వస్తే స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోసీ, డ్యూయల్ రియర్ కెమెరా, 8 జీబీ ర్యామ్ ఉన్నాయి. అయితే, అయితే, ఫ్రంట్ కెమెరా, డిస్‌ప్లే నాచ్ లేకపోవడం గమనార్హం. అయితే , డ్యూయల్ డిస్‌ప్లే ద్వారా రియర్ కెమెరాను ఉపయోగించి సెల్ఫీలు తీసుకోవచ్చు. ప్రస్తుతం ప్రి ఆర్డర్ రూపంలో చైనాలో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంది. వచ్చే నెల నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

నుబియా ఎక్స్ ధరల వివరాలు..

నుబియా ఎక్స్ 6జీబీ ర్యామ్/64 జీబీ వేరియంట్ ధర దాదాపు రూ.35 వేలు. అయితే, ఇది బ్లాక్, గ్రే, గోల్డ్ కలర్ వేరియంట్లకు మాత్రమే. బ్లూ కలర్ కావాలంటే మాత్రం రూ.36 వేలు చెల్లించాల్సి ఉంటుంది. 8 జీబీ ర్యామ్/128 జీబీ వేరియంట్ ధర రూ.39,200. బ్లూకలర్ వేరియంట్‌ ధర మాత్రం రూ.40,300. 8జీబీ/256 జీబీ స్టోరేజీ వేరియంట్ ధర రూ.44,500. బ్లూ, గోల్డ్ కలర్ వేరియంట్‌ల ధర మాత్రం రూ.45,600.

నుబియా ఎక్స్ స్పెసిఫికేషన్లు:

డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఓఎస్, 6.26 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్రైమరీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 5.1 అంగుళాల సెకండరీ డిస్‌ప్లే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 100 శాతం కలర్ శాచ్యురేషన్.

64 బిట్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 845 ఎస్‌వోఎస్, 6జీబీ, 8 జీబీ ర్యామ్ ఆప్షన్లు, 16+24 ఎంపీ డ్యూయల్ కెమెరా, 64 జీబీ, 128 జీబీ, 256 జీబీ స్టోరేజీ ఆప్షన్లు ఉన్న ఈ ఫోన్‌లో 3,800 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*