నన్ను అనుక్షణం అనుమానంతో చూసేవాడు: పావని

హైదరాబాద్: తనను అనుక్షణం అనుమానంతో చూసేవాడని తిరునగరి పావని వెల్లడించింది. పెళ్లైన నాటి నుంచీ తీవ్ర వేధింపులకు గురిచేశాడని ఆరోపించింది. పావని వేముల ప్రణయ్‌ అనే యువకుడితో వెళ్లిపోవడంతో ఆమె భర్త ప్రశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రశాంత్ ఆత్మహత్య తర్వాత పావని తొలిసారి స్పందించింది. వేధింపులు భరించలేకే తాను ప్రణయ్‌తో వెళ్లిపోయానని పావని చెబుతోంది.

మరోవైపు తమ కుమారుడి ఆత్మహత్యకు కారణమైన పావనిపై చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాతే పావని మీడియా ముందుకు వచ్చింది. తన భర్త వేధింపులు భరించలేకే వేముల ప్రణయ్‌తో వెళ్లిపోయానని తెలిపింది.

అసలేం జరిగిందంటే: 

కామారెడ్డికి చెందిన సాఫ్టే వేర్ ఉద్యోగి తిరునగరి ప్రశాంత్ వరంగల్ జిల్లాకు చెందిన పావనితో 2014లో పెళ్లిచేసుకున్నాడు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే. పెళ్లయ్యాక కొద్దిరోజులు కూకట్‌పల్లిలో కాపురం పెట్టారు. ఏడాదిలోపే సాఫ్ట్‌వేర్ కంపెనీలో కొలీగ్ అయిన ప్రణయ్‌తో పావని ప్రేమాయణం మొదలు పెట్టింది. కొద్ది రోజులయ్యాక విషయం పావని భర్త ప్రశాంత్‌కు తెలిసింది. విషయం నలుగురికి తెలిస్తే పరువు పోతుందంటూ ప్రశాంత్ పావనికి సర్ధి చెప్పాడు. కానీ పావని మాత్రం ప్రణయ్‌తో కలుస్తూనే ఉండేది. దీంతో ప్రశాంత్ విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. పెద్ద మనుషులు పావనిని పిలిపించి మందలించారు. భార్యాభర్తలు కలిసి ఉండాలని చెప్పి పంపించారు.

పావనికి మూడు నెలల కింద బెంగళూరులో జాబ్ రావడంతో అక్కడే ఉంటోంది. పావని బెంగళూరులో జాబ్ చేస్తూ సెలవు రోజుల్లో భర్త ప్రశాంత్ దగ్గరికి వచ్చి వెళ్లేది. పావని హైదరాబాద్‌లో పనిచేసేటప్పుడే ప్రణయ్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుందని ప్రశాంత్‌కి తెలిసింది. దీంతో పావని, ప్రశాంత్ మధ్య గొడవలు జరిగాయి. చాలా సార్లు ప్రశాంత్ పావనిని హెచ్చరించాడు. ప్రణయ్ కోసమే పావని బెంగళూరుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకుని తనను నమ్మించేందుకు సెలవు దినాల్లో హైదరాబాద్ వచ్చి వెళ్తోందని తెలిసి ప్రశాంత్ మానసిక క్షోభకు గురయ్యాడు.

వారం రోజుల కింద ప్రశాంత్ తన బావకు ఫోన్ చేసి పావని ప్రవర్తనతో పరువుపోతుందని, తాను ఆత్మహత్య చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. ఆయన ఎంత సర్ది చెప్పినా వినలేదు. చెప్పినట్టే ప్రశాంత్ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన భార్యకు ఎన్నిసార్లు చెప్పినా మారలేదని తాను హైదరాబాద్‌లో ఉంటే అడ్డుగా ఉంటానని బెంగళూరుకు వెళ్లి అక్కడ ప్రణయ్‌తో కాపురమే పెట్టిందని ప్రశాంత్ సూసైడ్ నోట్ లో రాశాడు. పావని ప్రవర్తనతో తాను జీవితంపై విరక్తి చెందానని ప్రశాంత్ లేఖలో వెల్లడించాడు.

పావనిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రశాంత్ కుటుంబ సభ్యులు పోలీసులను కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*