వన్డేల్లో ఆ ముగ్గురి అత్యధిక వ్యక్తిగత స్కోరు ఒకటే

క్రికెట్‌లో రికార్డులకు కొదవ ఉండదు. అత్యుత్తమం అనుకున్న రికార్డులు సైతం బద్దలవుతూ ఉంటాయి. టెస్ట్ క్రికెట్‌ నుంచి వన్డే, టీ20లకు మారాక క్రికెట్‌లో వేగం పెరిగింది. ఒకప్పుడు జట్టు మొత్తం చేసే పరుగులను ఇప్పుడు ఒక్కడే అలవోకగా సాధిస్తున్నాడు. ఈ విషయంలో రోహిత్ శర్మ గురించి చెప్పుకోవచ్చు. అయితే, భారత క్రికెట్‌లో ఓ అరుదైన రికార్డు కూడా ఉంది.

టీమిండియా మాజీ కెప్టెన్లు అయిన మహేంద్రసింగ్ ధోనీ, సౌరవ్ గంగూలీ, తాజా కెప్టెన్ విరాట్ కోహ్లీ ముగ్గురి వ్యక్తిగత అత్యధిక స్కోరు ఒకటే కావడం విశేషం. 31 అక్టోబరు, 2005న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 299 పరుగలు విజయ లక్ష్యాన్ని ఛేదించేందుకు భారత్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో ధోనీ చెలరేగాడు. 183 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అదే శ్రీలంక జట్టుపై 1999లో మాజీ సారథి గంగూలీ 183 పరుగులు చేయగా, పాకిస్థాన్‌పై 2012లో కోహ్లీ 183 పరుగులు చేశాడు. ఇలా ముగ్గురి అత్యధిక స్కోరు 183 కావడం విశేషమే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*