
రామడుగు: కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండ శివారులోని ఎన్నికల చెక్ పోస్టు వద్ద ఎన్నికల కోడ్లో భాగంగా వాహన తనిఖీలు నిర్వహిస్తున్న రామడుగు పోలీసు ష్టేషన్ హెడ్ కానిస్టేబుల్ షఫియొద్దీన్ లారీని ఆపేందుకు యత్నించాడు. అయితే డ్రైవర్ లారీని ఆపకుండా షఫియొద్దీన్ను ఢీకొట్టించాడు.
ఘటనలో షఫియొద్దీన్కు తీవ్రగాయాలయ్యాయి. ఆయన్ను 108 వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడిన పోలీసులు లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.
Be the first to comment