హైదరాబాద్‌లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్

హైదరాబాద్: క్రిస్టల్ మైండ్స్ మరియు విశిష్ట ఇన్నోవేషన్స్ సంయుక్తంగా క్రియేటివ్ టీమ్ సమర్పణలో హైదరాబాద్‌లో షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. సూపర్ స్టార్ కృష్ణగారి ఆశీస్సులతో జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో విజేతలకు ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి బహుమతులు అందజేయనున్నారు. టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ నటీనటులు, దర్శకులు జ్యూరీ మెంబర్స్‌గా జరుగనున్న ఈ కార్యక్రమంలో టాప్ టెన్ చిత్రాలను నవంబర్ 17వ తేదీన హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో ప్రదర్శించనున్నారు. అదే రోజు ఈ టాప్ టెన్‌ నుంచి ప్రథమ, ద్వితీయ, తృతీయ చిత్రాలను సెలక్ట్ చేసి మొదటి విజేతకు రూ. 50 వేలు, రెండవ విజేతకు రూ.30 వేలు, మూడవ విజేతకు రూ. 20 వేలు బహుమతిగా అందజేయనున్నారు.

రిజిస్ట్రేషన్ ఫీజుగా రూ. 500/- చెల్లించవలసి ఉంటుంది. అలాగే షార్ట్ ఫిల్మ్ మ్యాగ్జిమమ్ డ్యూరేషన్ 15 నిమిషాలు ఉండాలి.
రిజిస్ట్రేషన్ కోసం గడువు నవంబర్ 4వ తేదీ వరకు మాత్రమే. నవంబర్ 13వ తేదీ లోపు షార్ట్ ఫిల్మ్ వీడియోలను సబ్మిట్ చేయాలి.

ఈ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు www.krystalminds.in లో పొందుపరచబడ్డాయి.

contact: 7730028441, 9052747486

Mail:www.krystalminds.in@gmail.com

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*