హైదరాబాద్‌లో భారీ మొత్తం పట్టివేత

హైదరాబాద్:  హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో ఇవాళ ఒక్కరోజే ఏడు కోట్ల 51 లక్షల 10 వేల 300 రూపాయలు పట్టుకున్నారు. నలుగురిని అరెస్ట్ చేశారు.

పబ్లిక్ గార్డెన్, బంజారాహిల్స్, షాహినాయత్ గంజ్‌లో రాజ్ పురోహిత్, సునీల్ కుమార్ అహుజా, ఆశిష్ కుమార్ ఆహుజా, మహ్మద్ ఆజాంను అరెస్ట్ చేశారు. వీరిపై ఐపీసీ 171బీ, 468, 471, 420, రెడ్ విత్ 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వీరి వద్ద ఉన్న దేశవాళీ తుపాకీతో తో పాటు వోల్వో కారును సీజ్ చేశారు. కర్ణాటక రాష్ట్ర పరిధి మేరకు మాత్రమే లైసెన్స్ ఉన్న దేశవాళీ తుపాకీని కలిగివున్నందున సెక్షన్ 25బీ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరి వద్ద ఉన్న కరెన్సీ కౌంటింగ్ మెషిన్,వివిధ బ్యాంకులకు చెందిన 32 చెక్ బుక్ లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురిని పోలీసులు ప్రశ్నిస్తే హవాలా ఏజెంట్లమని చెప్పుకుంటున్నారు. వీరు హవాలా మార్గంలో డబ్బులు ఎవరెవరికి అందిస్తున్నారన్న కోణంలో పోలీసుల విచారణ కొనసాగుతోంది.

హైదరాబాద్ సిటీ పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసుల సంయుక్త ఆపరేషన్‌లో వీరిని అరెస్ట్ చేశారు. ఎన్నికల కోడ్‌లో భాగంగా విశ్వసనీయ సమాచారం రావడంతో దాడులు చేసి హవాలా డబ్బును పట్టుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ చెప్పారు. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో ఆయుధాలు కలిగి ఉండటం నేరమని ఆయన అన్నారు.

ఈ హవాలా కేసులో అశీష్ కుమార్ అహుజా ప్రధాన సూత్రధారి అని, వీరు కొన్ని షెల్ కంపెనీల పేరుతో అక్రమ లావాదేవీలు జరిపినట్లు గుర్తించామని అంజనీ కుమార్ చెప్పారు. ఈడీ,ఐటీ అధికారులకు ఈ నగదుపై సమాచారం అందించామని ఆయన అన్నారు. హైదరాబాద్‌ షాహినాయత్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత వారం కోటీ ఇరవై లక్షల రూపాయల హవాలా డబ్బును పట్టుకున్నారు. ఎలక్షన్ కోడ్ అమలయ్యాక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 20 కోట్ల రూపాయలను పోలీసులు తనిఖీల్లో గుర్తించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*