అర్ధరాత్రి లగడపాటి హంగామా.. పోలీసులపై కన్నెర్ర

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్‌ 65లో విజయవాడ మాజీ ఎంపీ, వ్యాపారవేత్త లగడపాటి రాజగోపాల్ హంగామా చేశారు. తన స్నేహితుడైన వ్యాపారవేత్త జీపీరెడ్డి నివాసంలో గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత బంజారాహిల్స్ పోలీసులు సోదాలు నిర్వహించడంపై ఆయన కన్నెర్ర చేశారు. సోదాలు చేయడానికి వచ్చిన పోలీసులను లగడపాటి అడ్డుకున్నారు. అనుమతి లేకుండా అర్ధరాత్రి సోదాలు చేయడానికి ఎలా వచ్చారంటూ పోలీసులపై లగడపాటి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మిత్రుడి ఇంట్లోకి రావడానికి సర్చ్ వారెంట్ ఉందా అని పోలీసులను లగడపాటి ప్రశ్నించారు.

ఐజీ నాగిరెడ్డి భూ విషయంలో తన మిత్రుడిని పోలీసులు బెదిరిస్తున్నారని లగడపాటి ఆరోపించారు. తనకు ఆరోగ్యం బాగాలేదని, తెల్లవారాక విచారణకు వస్తా అని పిచ్చిరెడ్డి తెలిపారు.

గతంలో రోడ్ నెంబర్ 12లో ఐపీఎస్ అధికారులకు చెందిన ల్యాండ్ వ్యవహారంలో తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించారని పిచ్చిరెడ్డిఫై బంజరాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. వెస్ట్ జోన్ డీసీపీ శ్రీనివాస్ మరియు పోలీసులు తనిఖీలు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*