తెలంగాణాలో విజేత ఎవరో తేల్చి చెప్పిన ఇండియా టుడే తాజా ఒపీనియన్‌ పోల్‌

న్యూఢిల్లీ: తెలంగాణాలో అధికారంలోకి రాబోయేది ఎవరో ఇండియా టుడే ఒపీనియన్‌ పోల్‌ తేల్చి చెప్పింది. టీఆర్‌ఎస్‌ ప్రభంజనం కొనసాగుతోందని, రెండోసారి అధికారంలోకి వచ్చేది టీఆర్‌ఎస్సేనని ఇండియా టుడే వెల్లడించింది. మళ్లీ టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని 75 శాతం మంది భావిస్తున్నారని తెలిపింది. 44 శాతం ఓట్లతో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధిస్తుందని ఇండియా టుడే ఒపీనియన్‌ పోల్‌లో వెల్లడైంది.

గతంలో నిర్వహించిన పోల్ కన్నా కేసీఆర్‌ ప్రజాదరణ తాజా పోల్‌లో 3 శాతం పెరిగిందని ఇండియా టుడే వెల్లడించింది. విపక్షాలు కూటమిగా ఏర్పడ్డా ప్రయోజనం లేదని పోల్ తేల్చింది. తెలంగాణలో ప్రభుత్వ అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయని ఇండియా టుడే తెలిపింది.  సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్‌‌ను గెలిపించబోతున్నాయని ఇండియా టుడే ఒపీనియన్‌ పోల్‌ వెల్లడించింది. టీఆర్‌ఎస్‌కు రోజురోజుకు ప్రజా మద్దతు పెరుగుతోందని, స్పష్టమైన మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే తెలిపింది. జనాదరణలో కేసీఆర్‌ను మించిన నాయకుడు లేరని కూడా ఇండియా టుడే వెల్లడించింది.

అయితే ఇండియా టుడే ఒపీనియన్ పోల్‌ను మహాకూటమి నేతలు కొట్టిపారేస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ సంయుక్తంగా మెజార్టీ సీట్లు సాధిస్తాయని, తాము అధికారంలోకి రావడం ఖాయమని మహాకూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*