కుదిరిన మహాకూటమి సీట్ల సర్దుబాటు.. కాంగ్రెస్ ఫస్ట్ లిస్ట్ రెడీ

న్యూఢిల్లీ: తెలంగాణలో మహాకూటమి మధ్య సీట్ల సర్దుబాటు కుదిరింది. 119 స్థానాలకు గాను కాంగ్రెస్ 93, టీడీపీ 14, టీజేఎస్ 8, సీపీఐ 3 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. యూపిఏ చెయిర్ పర్సన్ సోనియాగాంధీ నివాసంలో కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏఐసీసీ కార్యాలయం తరపున తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ కుంతియా ప్రకటించారు. కూటమిలోని మిత్ర పక్షాలకు 25 సీట్లను కేటాయించామన్నారు.

కాంగ్రెస్ ఇప్పటికే 74 స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. తొలి జాబితా ఈ నెల 10న విడుదల చేస్తామని కుంతియా తెలిపారు. ఇప్పటికే జాబితాను టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు అందించారు. ఈ నెల 10న ఉదయం 11 గంటలకు జాబితా విడుదల కానుంది. మిగిలిన స్థానాల్లో పోటీ చేసే అభ్యర్ధుల జాబితా 12కల్లా విడుదల చేస్తామన్నారు.

సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం రావడంతో మహాకూటమిలోని నేతలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ, టీజేఎస్, సీపీఐ నేతల్లో పండగ వాతావరణం నెలకొంది. పొత్తు కారణంగా గెలవడం ఖాయమని మహా కూటమి నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మహాకూటమి కారణంగా టీఆర్ఎస్‌ నేతలకు నిద్ర కరువైందని టీటీడీపీ ఎద్దేవా చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*