పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని కడతేర్చాడు

పెన్షన్ డబ్బులు ఇవ్వలేదని కన్న తండ్రిని ఓ తనయుడు ఇనుప రాడ్‌తో కొట్టి చంపిన ఘటన మీర్‌పెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెల గూడలో జరిగింది. వనస్థలిపురం

ఏసీపీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు కృష్ణ (58) వాటర్ బోర్డ్‌లో ఉద్యోగిగా పని చేసి 6నెలల క్రితం పదవీ విమరణ చేశారు. నెల వారీగా వచ్చే పెన్షన్ డబ్బులు ఇవ్వాలని కుమారుడు తరుణ్ తరచుగా తండ్రితో గోడవపడేవాడు. డబ్బులు ఇవ్వడం లేదని పగ పెంచుకున్న తరుణ్ ఇనుప రాడ్‌తో తండ్రిని కొట్టి చంపాడు. అనంతరం పరారయ్యాడు.

ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. తండ్రిని హత్య చేసి పారిపోయిన తరుణ్ కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*