
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి తరపున పోటీ చేయనున్న మరో పదిమంది అభ్యర్ధులతో ఆ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జాబితా విడుదల చేశారు.
పది నియోజకవర్గాల టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు శ్రీ కేసిఆర్ ప్రకటించారు.
1. మేడ్చల్ – శ్రీ చామకూర మల్లారెడ్డి
2. గోషామహల్ – శ్రీ ప్రేమ్ సింగ్ రాథోడ్
3. చార్మినార్ – శ్రీ మహమ్మద్ సలావుద్దీన్ లోడి
4. వరంగల్ తూర్పు – శ్రీ నన్నపనేని నరేందర్— TRS Party (@trspartyonline) November 14, 2018
మేడ్చల్‌లో చామకూర మల్లారెడ్డి, గోషామహల్లో ప్రేమ్ సింగ్ రాథోడ్, చార్మినార్‌లో మహమ్మద్ సలావుద్దీన్ లోడి, వరంగల్ తూర్పులో నన్నపనేని నరేందర్‌కు టికెట్లిచ్చారు. ఎంపీగా ఉన్న మల్లారెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కేసీఆర్ వ్యూహంలో భాగంగానే మల్లారెడ్డిని బరిలోకి దించినట్లు సమాచారం.
5. హుజుర్ నగర్ – శ్రీ శానంపూడి సైదిరెడ్డి
6. వికారాబాద్ – శ్రీ డాక్టర్ మెతుకు ఆనంద్
7. అంబర్ పేట – శ్రీ కాలేరు వెంకటేష్
8. మల్కాజిగిరి – శ్రీ మైనంపల్లి హన్మంతరావు
9. చొప్పదండి – శ్రీ సుంకె రవిశంకర్
10. ఖైరతాబాద్ – శ్రీ దానం నాగేందర్
అభ్యర్థిత్వాలను కేసీఆర్ గారు ఖరారు చేశారు— TRS Party (@trspartyonline) November 14, 2018
హుజూర్‌నగర్‌లో శానంపూడి సైదిరెడ్డి వికారాబాద్‌లో డాక్టర్ మెతుకు ఆనంద్, అంబర్‌పేటలో కాలేరు వెంకటేష్‌కు టికెట్లు లభించాయి. మల్కాజిగిరిలో మైనంపల్లి హన్మంతరావు, చొప్పదండిలో సొంకె రవిశంకర్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్ అభ్యర్థిత్వాలను కేసీఆర్ ఖరారు చేశారు. ఖైరతాబాద్‌లో కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్‌తో దానం తలపడనున్నారు.
మిగిలిన కోదాడ, ముషీరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు.
మిగిలిన కోదాడ ముషీరాబాద్ నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి పార్టీ ముఖ్య నాయకులతో చర్చించి ఒకటి, రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రకటించారు.#TelanganaWithKCR #PhirEkBaarKCR #VoteForCar
— TRS Party (@trspartyonline) November 14, 2018
కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ప్రకటించినప్పుడే వందకు పైగా అభ్యర్ధులను ప్రకటించారు. కేసీఆర్ నేడు గజ్వేల్ నియోజకవర్గం నుంచి నామినేషన్ కూడా దాఖలు చేశారు.
గజ్వేల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా గజ్వేల్ ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేసిన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.#TelanganaWithKCR #PhirEkBaarKCR #VoteForCar pic.twitter.com/MAynnwxYIf
— TRS Party (@trspartyonline) November 14, 2018
This post is also available in : English
Be the first to comment