మరో జాబితా విడుదల చేసిన కాంగ్రెస్.. అభ్యర్ధులు వీరే…

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్ధులతో కాంగ్రెస్ పార్టీ మరో లిస్ట్ విడుదల చేసింది. తాజా జాబితాలో పది మంది అభ్యర్ధులను ప్రకటించింది.

ఖైరతాబాద్ నుంచి దాసోజు శ్రవణ్‌ను బరిలోకి దించారు. జూబ్లీహిల్స్ నుంచి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డికి టికెట్ ఇచ్చారు. విష్ణుకు టికెట్ రావడంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ కీలకంగా వ్యవహరించారు.

ఖానాపూర్ నుంచి రమేశ్ రాథోడ్, ఎల్లారెడ్డి నుంచి జే సురేందర్, ధర్మపురి నుంచి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సిరిసిల్ల నుంచి కేకే మహేందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, షాద్ నగర్ నుంచి ప్రతాప్ రెడ్డి, భూపాలపల్లి నుంచి గండ్ర వెంకట రమణారెడ్డి, పాలేర్ నుంచి కందల ఉపేందర్ రెడ్డికి టికెట్లు లభించాయి. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ జనరల్ సెక్రటరీ ముకుల్ వాస్నిక్ ద్వారా ప్రకటన వెలువడింది.

నవంబర్ 12న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం 65 మందితో జాబితా విడుదల చేసింది.

 

65 మంది కాంగ్రెస్ అభ్యర్ధులు వీరే….

అచ్చంపేట్- సీ.హెచ్ వంశీకృష్ణ
కల్వకుర్తి- వంశీ చంద్‌రెడ్డి
నాగార్జున సాగర్- జానారెడ్డి
హుజుర్ నగర్- ఉత్తమ్ కుమార్ రెడ్డి
కోదాడ- పద్మావతి రెడ్డి
సూర్యాపేట్- ఆర్. దామోదర్ రెడ్డి
నల్గొండ- కోమటిరెడ్డి వెంకట్ ‌రెడ్డి
మునుగోడు- కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి
భువనగిరి- కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నకిరేకల్- చిరుముర్తి లింగయ్య
ఆలేరు- భిక్షమయ్య గౌడ్
స్టేషన్ ఘన్‌పూర్- సింగపూర్ ఇందిర
పాలకుర్తి- జంగా రాఘవరెడ్డి
డోర్నకల్- జాటోత్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్- పోరిక బలరాం నాయక్
నర్సంపేట్- దొంతి మాధవ్ రెడ్డి
పరకాల- కొండా సురేఖ
ములుగు- డి. అనసూయ అలియాస్ సీతక్క
పినపాక- రేగ కాంతారావు
మధిర- మల్లు భట్టి విక్రమార్క
కొత్తగూడెం – వనమా వెంకటేశ్వరరావు
భద్రాచలం- పోడెం వీరయ్య

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*