దొరికిన చంద్రముఖి ఆచూకీ… వీడిన ఉత్కంఠ

హైదరాబాద్: గోషామహల్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి, ట్రాన్స్‌జెండర్ చంద్రముఖి ఆచూకీ తెలిసింది. దీంతో ఉత్కంఠ వీడింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌లో ఉంటున్న చంద్రముఖి ఇంటి నుంచి రెండ్రోజుల క్రితం మాయమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రముఖిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో తొలుత ఉత్కంఠ పెరిగింది.

డిసెంబర్ ఏడున ఎన్నికల నేపథ్యంలో చంద్రముఖి మిస్సింగ్‌ కేసు పోలీసులకు సవాల్‌గా మారడంతో దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి మరీ బంజారాహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, జాడ కోసం వెతికారు. ఇంతలోనే చంద్రముఖి తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడ ఉన్నా కోర్ట్‌లో ప్రవేశపెట్టే విదంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. వెంటనే చంద్రముఖిని ప్రవేశపెట్టాలని బంజారాహిల్స్‌ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

గాలింపు తీవ్రం చేసిన పోలీసులు ఎట్టకేలకూ ఆమె ఆచూకీని కనిపెట్టారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పోలీస్ స్టేషన్‌కు చంద్రముఖి తల్లి కూడా వచ్చారు.

గోషామహల్ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి రాజాసింగ్ రాథోడ్, టీఆర్ఎస్ నుంచి ప్రేమ్ సింగ్ రాథోడ్, కాంగ్రెస్ నుంచి ముఖేష్ గౌడ్ తలపడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*