
హైదరాబాద్: గోషామహల్ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి, ట్రాన్సజెండర్ చంద్రముఖి ఆచూకీ ఇంకా తెలియడం లేదు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 ఇందిరానగర్‌లో ఉంటున్న చంద్రముఖి ఇంటి నుంచి నిన్న మాయమయ్యారు. గుర్తు తెలియని వ్యక్తులు చంద్రముఖిని కిడ్నాప్ చేశారని వార్తలు వచ్చాయి. చంద్రముఖి ఇంటికి తాళం వేసి ఉండడం, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో ఉత్కంఠ పెరుగుతోంది.
అటు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో చంద్రముఖి మిస్సింగ్ కేసు పోలీసులకు సవాల్‌గా మారింది. దర్యాప్తు వేగవంతం చేసిన బంజారాహిల్స్ పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు. సెల్ ఫోన్ టవర్ లొకేషన్, జాడ కోసం వెతుకుతున్నారు.
మరోవైపు చంద్రముఖి తల్లి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. చంద్రముఖి ఎక్కడ ఉన్నా కోర్ట్‌లో ప్రవేశపెట్టే విదంగా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
Be the first to comment