తెలంగాణను అడ్డుకున్న వ్యక్తితో స్నేహమా? కేటీఆర్‌పై రేవంత్ ఫైర్

ఆంధ్రా ఆక్టోపస్‌ లగడపాటి రాజగోపాల్ బయటపెట్టిన తెలంగాణ ఎన్నికల సర్వేను చిలక జోస్యమన్న కేటీఆర్ ట్వీట్‌పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి స్పందించారు. లగడపాటితో జరిగిన చాట్‌ను బయటపెట్టి మొత్తానికి ఆయనతో ఉన్న స్నేహాన్ని బయటపెట్టారని చరుకలు అంటించారు. ప్రత్యేక తెలంగాణను అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నించి, చివరికి తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టిన లగడపాటితో తనకు రహస్య స్నేహం ఉందని అంగీకరించారని ఆరోపించారు. #RejectKTR #byebyeKCR అంటూ హ్యాష్‌టాగ్‌లతో రేవంత్ చేసిన ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

కాగా, లగడపాటి రాజగోపాల్ వెల్లడించిన సర్వే వివరాలు తెలంగాణ పెను చర్చకు దారితీశాయి. తెలంగాణలో ప్రజాకూటమి విజయం దాదాపు ఖాయమని చెప్పడంతో కూటమి నేతలు సంతోషంలో మునిగిపోగా, టీఆర్ఎస్ నేతలు డీలా పడ్డారు. నిన్నమొన్నటి వరకు గెలుస్తామన్న ధీమా ఏమోలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు లగడపాటి షాకిచ్చినట్టు అయింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*