చైనాలోనూ ‘చిట్టి’.. డ్రాగన్ కంట్రీలోనూ విడుదల కానున్న రజనీ సినిమా

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.ఓ’ చైనాలోనూ విడుదల కాబోతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుత కలెక్షన్లతో దూసుకుపోతోంది. త్వరలోనే ఈ సినిమాను చైనాలో విడుదల చేయబోతున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. చైనాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్‌వై మీడియాతో కలిసి ‘2.ఓ’ను విడుదల చేయబోతున్నట్టు లైకా పేర్కొంది. సనిమా డబ్, సబ్ టైటిల్ వెర్షన్‌ను 10 వేల థియేటర్లలోని 56 వేల స్క్రీన్లలో వచ్చే ఏడేది మేలో విడుదల చేయనున్నట్టు వివరించింది. ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తున్న ‘2.ఓ’ చైనాలోనూ దుమ్మురేపుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

2010లో వచ్చిన రోబో సినిమాకు సీక్వెల్‌గా ‘2.ఓ’ను తెరకెక్కించారు. రజనీకాంత్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్‌గా నటించాడు. అమీజాక్సన్ హీరోయిన్. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. బాక్సీఫీస్ రికార్డులు బద్దలు గొడుతున్న ‘2.ఓ’ నాలుగు రోజుల్లోనే రూ.400 కోట్లు వసూలు చేసినట్టు చిత్ర బృందం ప్రకటించింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*