కూకట్‌పల్లిలో డబ్బు కట్టల కలకలం.. జూపూడి ఇంట్లో పోలీసుల సోదాలు

హైదరాబాద్ కూకట్‌పల్లిలో డబ్బుల కట్టల కలకలం రేగింది. ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఆయన ఇంటి వెనకవైపు నుంచి డబ్బు కట్టల సంచులతో పారిపోతున్న ఇద్దరిని పట్టుకున్న టీఆర్ఎస్ నేతలు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో జూపూడి ఇంట్లో పోలీసులు సోదాలు నిర్వహించారు.

శుక్రవారం పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆ డబ్బును పంచాలని చూస్తున్నారని, జూపూడిని అరెస్ట్ చేయాలని టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో కూకట్‌పల్లిలో ఒక్కసారిగా కలకలం రేగింది. తమను చూడడంతో డబ్బు సంచులు పక్కింట్లోకి విసిరేసి కొందరు పారిపోయారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*