లగడపాటి సర్వేలో నిజమెంత?.. 2014లో ఏం జరిగింది?

ఇటు తెలంగాణలోనూ, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ సర్వేపై ఒకటే చర్చ. రాజగోపాల్ సర్వే టీఆర్ఎస్ నేతల గుండె వేగాన్ని పెంచగా, ప్రజాకూటమి నేతలు రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. మంగళవారం విలేకరులతో మాట్లాడిన లగడపాటి సర్వే వివరాలను పాక్షికంగా వివరించారు. పోలింగ్ శాతం కనుక పెరిగితే ప్రజాకూటమి విజయం తథ్యమని చెప్పుకొచ్చారు. అంతేకాదు, జిల్లాల వారీగా ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉందనే వివరాలు వెల్లడించిన రాజగోపాల్.. తెలంగాణలోని మొత్తం 119 నియోజకవర్గాలకు గాను 110 జిల్లాల్లో నియోజకవర్గాల్లో సర్వే చేసినట్టు చెప్పుకొచ్చారు. శుక్రవారం సాయంత్రం పోలింగ్ ముగిసిన వెంటనే సర్వే పూర్తి వివరాలను వెల్లడించనున్నట్టు తెలిపారు.

ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుగాంచిన లగడపాటి సర్వేలకు ఇప్పటి వరకు తిరుగులేదని నిరూపితమైంది. అయితే, తాజా సర్వేపై మాత్రం విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌కు రెండు రోజల ముందు సర్వే వివరాలను వెల్లడించడం వెనక ప్రజాకూటమికి మేలు చేయాలనే ఉద్దేశం దాగి ఉందని అనుమానిస్తున్నారు. అంతేకాదు, ఈ విషయంలో ప్రజాకూటమి పెద్దల హస్తం కూడా ఉండే అవకాశం ఉందని అంటున్నారు.

మరోవైపు, లగడపాటి చెప్పారంటే జరిగి తీరుతుందని కూడా చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు 60 సీట్లకు అటూఇటుగా వస్తాయని చెప్పారు. ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి 115-125 స్థానాలు వస్తాయన్నారు. ఆయన చెప్పినట్టుగా తెలంగాణలో టీఆర్ఎస్‌ 63 స్థానాల్లో విజయం సాధించగా, ఏపీలో టీడీపీ-బీజేపీ కూటమికి 106 స్థానాలు వచ్చాయి. దీంతో టీఆర్ఎస్ నేతల్లో గుబులు మొదలైంది. లగడపాటి చెప్పినట్టే జరిగితే పరిస్థితి ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. ఒకవేళ సర్వే అటూ ఇటు అయితే, ఇకపై లగడపాటి సర్వేలకు విలువ ఉండదు. ఆయన పూర్తిగా విశ్వసనీయత కోల్పోయే అవకాశాలున్నాయి. మరి ‘విశ్వాస పరీక్ష’లో లగడపాటి నెగ్గుతారా? లేదా? తెలియాలంటే 11వ తేదీ వరకు ఆగాల్సిందే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*