మోత్కుపల్లి నర్సింహులుకు గుండెపోటు.. ఆందోళనలో అభిమానులు

యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఆలేరు నియోజకవర్గ బహుజన లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థి మోత్కుపల్లి నర్సింహులుకు గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన్ను హుటాహుటిన హైదరాబాద్ నాగోల్ సుప్రజ ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి నుంచి ఆయన వాంతులు, చెస్ట్ పెయిన్‌తో బాధపడుతున్నారు. ఉదయం 7 గంటలకు యాదగిరి గుట్టలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది. అంబులెన్స్ రాకపోవడంతో సొంత వాహనంలో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మోత్కుపల్లికి డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఆయన హెల్త్‌బులెటిన్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఎన్నికల్లో ఉధృతంగా ప్రచారం చేయడంతో మోత్కుపల్లి అలసిపోయారు. ఈ క్రమంలో ఆయన సొమ్మసిల్లి పడిపోయారు. మోత్కుపల్లి ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అద్భుతమైన వక్తగా, పోరాటపటిమ ఉన్న దళిత నేతగా పేరున్న మోత్కుపల్లి టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశారు. గవర్నర్ పదవి గ్యారంటీ అనే ప్రచారం జరిగింది. అయితే మారిన రాజకీయ సమీకరణాల వల్ల ఆయనకు గవర్నర్ పదవి దక్కలేదు.

 

 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*