పుకార్లకు చెక్.. ఓటేసిన తారక్

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి తారక రామారావు ఓటేశారు. తన తల్లి, భార్యతో కలిసి జూబ్లీహిల్స్ ఓబుల్ రెడ్డి స్కూల్‌లోని పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తారక్ ఓటెయ్యడంతో ఇంతకాలం వచ్చిన పుకార్లకు చెక్ పెట్టినట్లైంది. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తారక్ బరువు పెరిగారని అందుకే ఆయన బయటకు రావడం లేదని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ కారణంగానే సోదరి నందమూరి సుహాసినికి కూకట్‌పల్లి నియోజకవర్గంలో ప్రచారం చేయలేకపోయారని కూడా ప్రచారం జరిగింది. అయితే మీడియాలో వచ్చిన కథనాలన్నీ ఉత్తివే అని తేలిపోయింది. తారక్ ఎప్పటిమాదిరిగానే ఉన్నారు. బరువు పెరగలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించి తాజా షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్నారు. అయితే సుహాసినికి తారక్ ఎందుకు ప్రచారం చేయలేదనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు.

కూకట్‌పల్లి నుంచి బరిలో నిలిచిన నందమూరి సుహాసినికి మద్దతుగా తారక్, కళ్యాణ్‌రాం సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. సుహాసినికి ఓటెయ్యాలని పిలుపునిచ్చారు. అయితే ప్రత్యక్షంగా ప్రచారం చేయలేదు. సుహాసిని తరపున టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, నందమూరి బాలకృష్ణ, తారకరత్న తదితరులు ప్రచారం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రచారం చేస్తారని ప్రచారం జరిగింది. అయితే తారక్ ప్రచారానికి రాలేదు.

నందమూరి హరికృష్ణకు నల్గొండ జిల్లాలో యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే కేసీఆర్ సర్కార్ తన మంత్రిని పంపించి ఆసుపత్రికి తరలించి చికిత్స అందించింది. ఆ తర్వాత హరికృష్ణ చనిపోయాక సీఎం కేసీఆర్ స్వయంగా వచ్చి తారక్‌ను, కళ్యాణ్‌రామ్‌ను పరామర్శించారు. ఆ తర్వాత పూర్తి అధికారిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతేకాదు హరికృష్ణ మెమోరియల్ కట్టుకునేందుకు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అనుమతినిచ్చింది. సరిగ్గా ఈ కారణంగానే తారక్ నందమూరి సుహాసినికి ప్రచారం చేయలేదని భావిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*