రామ్ చరణ్ ఓటు ఎందుకు వేయలేకపోయారంటే!

హైదరాబాద్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓటుహక్కు వినియోగించుకోలేకపోయారు. విదేశాలకు వెళ్లడమే కారణమని మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. జూబ్లీహిల్స్ క్లబ్ వద్ద ఓటేసేందుకు వచ్చిన మెగాస్టార్‌ను విలేకరులు పలకరించారు. రామ్‌చరణ్ కొద్దిరోజులుగా విదేశాల్లో ఉన్నారని చెప్పారు. అందుకే రాలేకపోయారని చెప్పారు. చిరు తన భార్య, కుమార్తెలతో పాటు ఓటేసేందుకు వచ్చారు. తన కుటుంబ సభ్యులతో పాటు చిరు లైన్‌లో ఓపికగా నిల్చొని ఓటేశారు.

ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం ప్రతి ఒక్కరి ధర్మమని చిరంజీవి చెప్పారు. ఓటు హక్కు ఉన్న వారంతా ఓటేయాలని చిరు పిలుపునిచ్చారు.

మరోవైపు అక్కినేని నాగార్జున, అక్కినేని అమల, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, నితిన్, రాజమౌళి ఇతర సినీ ప్రముఖులు ఓటేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*