గరికపాటి సంచలన నిర్ణయం

తన ప్రవచనాలతో కోట్లాది మంది అభిమానులను తట్టి లేపిన మహా సహస్రావధాని గరికపాటి నరసింహారావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2019 ఏప్రిల్ నుంచి ప్రవచనాలు, టీవీ కార్యక్రమాలకు స్వస్తి పలకనున్నారు. రమణ మహర్షి ఆధ్యాత్మిక బోధనలే ప్రేరణగా ఎక్కువ సమయం మౌనంగా గడపాలని నిర్ణయించుకున్నారు. లలితా సహస్రనామ పారాయణలో ఇంకా 800 నామాలపై ప్రసంగాలు ఇవ్వాల్సి ఉందని, ముందుగా ఒప్పందం కుదుర్చుకున్న కార్యక్రమాలన్నింటినీ ఏప్రిల్‌ నాటికి పూర్తిచేయనున్నారు.

ఇకపై మౌనవ్రతం చేపట్టాలని గరికపాటి తీసుకున్న నిర్ణయంపై ఆయన అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఆయన నిర్ణయం వ్యక్తిగతమే అయినా నాలుగు మంచి మాటలు చెప్పే పెద్ద మనిషి మౌనాన్ని ఆశ్రయించడంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఆయన ప్రవచనాలు ప్రతి తెలుగు కుటుంబానికి చేరాయి. మొబైల్ ఫోన్ ఉన్న ప్రతి తెలుగువాడి అరచేతిలోకి గరికపాటి ప్రవచనాలు చేరాయి. ఆయన మాటల ద్వారా స్ఫూర్తి పొందని తెలుగు వాడు లేడంటే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు.

తెలుగువారితో మమేకమైన గరికపాటి ఒక్కసారిగా మౌనవ్రతం చేపట్టాలని తీసుకున్న నిర్ణయాన్ని పున:పరిశీలించాలని కోట్లాది మంది అభిమానులు కోరుకుంటున్నారు. మరోవైపు గరికపాటి కుమారుడు గురజాడ ఇకపై ప్రవచనాలు ప్రారంభించనున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*