శుభలేఖ + లు సినిమా రివ్యూ

సినిమా పేరు: శుభలేఖ + లు
ఈక్షణం రేటింగ్: 3.5/5
నటీనటులు: శ్రీనివాస సాయి, ప్రియ వడ్లమాని, దీక్షా శర్మ
దర్శకుడు: శరత్
నిర్మాత: విద్యా సాగర్
మ్యూజిక్: కె.ఎం. రాధా కృష్ణ
విడుదల తేదీ: డిసెంబర్ 7వ తేది

సినిమా గురించి: ‘శుభలేఖ + లు’ సినిమా పేరుకు తగినట్టుగానే ఉంటుంది. మూడు అందమైన ప్రేమ కథలు పలు మలుపులు తిరుగుతూ చక్కని అనుభూతిని కలిగిస్తాయి. అందులో ఉండే ఎత్తుపల్లాలు, భావోద్వేగమైన ఫీలింగ్స్ మనల్ని కట్టిపడేస్తాయి.

మ్యూజిక్: రాధా కృష్ణ సంగీతం చాలా బాగుంటుంది.
సినిమాటోగ్రఫీ: మురళీ మోహన్ రెడ్డి
ఎడిటింగ్: మధు

దర్శకులు శరత్ ఒక మంచి కథను చాలా అందంగా చూపించారు.

సినిమా బలాలు: అందమైన వినోదాత్మక చిత్రం, హీరో పాత్రలో సాయి శ్రీనివాస్, ఇంకా దీక్షా శర్మ, ప్రియ వడ్లమాని కూడా చక్కగా నటించారు.

 

సినిమా కథ:

హీరో చందు తన సిస్టర్ పెళ్లి విషయంలో వచ్చిన పెద్ద సమస్యను చాకచక్యంగా పరిష్కరిస్తాడు. అది పరిష్కారమైన వెంటనే మరో పెద్ద సమస్య వస్తుంది. ఈసారి మాత్రం తన ప్రేమ సమస్యే. అసలే ఇంట్లో వాళ్లందరూ తనపై కోపంగా ఉన్న సమస్యలో ఇది చిత్రాన్ని పీక్‌ స్టేజ్‌కు తీసుకెళుతుంది. ఈ సినిమాలో మూడు ప్రేమ కథలు ఉంటాయి. అయితే ఈ మూడింటికీ సమస్యలు వచ్చి అడుగడుగునా మనకు ఆసక్తిని పెంచుతాయి. అయితే చివరికి అవి ఎలా పరిష్కారమయ్యాయి అనేది మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఇది పూర్తి కుటుంబ కథా చిత్రం. డిసెంబర్ 7వ తేదీని ఈ సినిమా విడుదలయ్యింది.

హీరో చందు పాత్రలో సాయి శ్రీనివాస్ అద్భుతంగా నటించారు. మన పక్కింటి కుర్రాడన్న విధంగా ఆకట్టుకున్నాడు. అయితే కుటుంబంలో అయిష్టతను ఎదుర్కొంటాడు. కానీ అంతలోనే ఎదురైన పెద్ద సమస్యను ఒంటిచేత్తో పరిష్కరించి కుటుంబం పరువును కాపాడతాడు. సమస్య ఏమిటి? ఎలా కాపాడాడనే అంశాలు చాలా ఆసక్తికరంగా అనిపిస్తాయి. ప్రేమలు, సమస్యలు, కుటుంబం, పెళ్లి వీటి చూట్టేతనే కథను దర్శకుడు చూపించాడు. ఈ రోజుల్లో ప్రేమలు ఎలా ఉంటున్నాయనేది ఈ మూవీలో బాగా కనిపిస్తుంది. మూడు ప్రేమ కథలు కూడా ఒకే కుటుంబంలోనే చూపించి ఒక అందమైన ప్రయాణ అనుభూతిని మనకు దర్శకుడు కలిపిస్తాడు. హీరో, హీరో సిస్టర్ ప్రేమ కథలతో పాటు సమాంతరంగా మరో ప్రేమ కథ నడుస్తుంది. ఈ మూడు ప్రేమ కథలు చాలా భావోద్వేగంగా, ఒక అందమైన ప్రయాణంలా సాగి ముగుస్తాయి. ఈ సినిమా పూర్తి కుటుంబ కథా చిత్రం. ఒకే కుటుంబంలో సాగే మూడు ప్రేమ కథలు మూడు శుభలేఖలు అన్న విధంగా మూవీ ఉంటుంది.

 

ఈక్షణం రేటింగ్: 3.5

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*