పెళ్లి రోజు’ మూవీ రివ్యూ

సినిమా: పెళ్లి రోజు..

డిసెంబర్ 8న ‘పెళ్లి రోజు’ సినిమా విడుదలైంది. మంచి హిట్ టాక్‌ను సాధించింది. ‘ఓరు నాల్ కూతు‘ పేరుతో తమిళ్‌లో విడుదలై మంచి హిట్ కొట్టింది. దీంతో తెలుగులో పెళ్లి రోజు పేరుతో విడుదల చేశారు. దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినీ యోగ్ మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రవీణ్ కందికట్టు సమర్పణలో మృదుల మంగిశెట్టి, సరస్వతి మంగిశెట్టి నిర్మించారు. దినేష్, నివేత పేతురాజ్, మియా జార్జ్, రిత్విక, రమేష్ తిలక్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో కామెడీ బాగా పండింది. రేడియో జాకీల పాత్రలను ఎంచుకుని నేటి యువతీ, యువల ఆలోచనలను ప్రతిబింబించేందుకు మంచి మార్గాన్ని దర్శకుడు ఎంచుకున్నారు.

కథ: మూడు జీవితాలు, మూడు పెళ్లిల్లు, మూడు సమస్యలు వాటి పరిష్కారం అదే మొత్తం సినిమా. కానీ వాటిని చూపించిన విధానం ఎమోషన్స్ చాలా బాగున్నాయి. ప్రధానంగా ఈ సినిమాను ముగ్గురు అమ్మాయిల వివాహాల ఆధారంగా చిత్రించారు. ముగ్గురికీ పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అందుకు ప్రయత్నాలు ఉంటాయి. ఈ ప్రయాణంలో చివరికి ఏ సమస్యలు ఏ దశకి చేరుకుంటాయనేది తెరపై చక్కగా చూపించారు.

వీరిలో ఒక అమ్మయి కావ్య (నివేత పేతు రాజు) తన కొలీగ్ (రాజ్) దినేష్ ను ప్రేమిస్తుంది. పెళ్లి చేసుకోవాలకున్న సమయంలో కావ్య ఫాదర్ పేదవాడైన రాజ్‌ను అంగీకరించక కావ్యకు వేరే సంబంధం చూస్తాడు. తప్పని పరిస్థితిలో ఆ పెళ్లిని అంగీకరిస్తుంది కావ్య. ఆ పెళ్లి జరిగే సమయానికి పెళ్ళికొడుకు తండ్రి చనిపోతాడు. అమ్మాయి దురదృష్టురాలని పెళ్లి క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు కావ్య పెళ్లి ఎవరితో జరిగిందనేదే అసలు విషయం.

ఇక రెండో అమ్మాయి లక్ష్మి (మియా జార్జ్) ఆమెకు తగ్గ వరుడు కోసం ప్రతి సారీ పెళ్లి చూపులను జరిపిస్తుంటాడు ఆమె తండ్రి. తండ్రి చాటు పెరిగిన అమ్మాయి కావడంతో ఎదిరించలేక తానూ కూడా పెళ్లి చూపులకు సిద్దపడుతూనే ఉంటుంది. ఒక రోజు పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయికి లక్ష్మి అమితంగా నచ్చడంతో పెళ్లి చేసుకోవాలనుకుంటారు ఆ పెళ్లి అనివార్య కారణాల వల్ల ఆగిపోతుంది.

ఇక మూడో అమ్మయి పెళ్లి సంసారంపై ఆశలున్న సుశీల (రిత్విక) రేడియో జాకీ గా పని చేస్తుంటుంది. కానీ వచ్చిన సంబంధాల్నీ వెనక్కి పోతుంటాయి. ఈ క్రమంలోనే ఓ సంబంధం ఖాయం అవుతుంది. మొదట ఆ పెళ్ళికి ఒకే చెప్పినా తరువాత పెళ్లి క్యాన్సిల్ చేసుకోమని సుశీలకు చెబుతాడు పెళ్ళికొడుకు భాస్కర్. షాక్ తిన్న సుశీల ఎలాగైనా భాస్కర్ ను పెళ్లి కు ఒప్పించమని ఆమె అన్నయ్యకు చెప్పి ఓ ప్రోగ్రామ్ పని మీద బెంగుళూరు వెళ్ళిపోతుంది. పట్టు పట్టడంతో భాస్కర్ పెళ్ళికి అంగీకరిస్తాడు కానీ ఈసారి సుశీల పెళ్లిచేసుకోనని చెబుతుంది. ఇలా వారి వారి పెళ్లి సమయాలకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి..? ఆ ముగ్గురు ఎవరెవరిని పెళ్లి చేసుకున్నారన్నదే పెళ్లి రోజు క్లైమాక్స్.

అందరూ ఎవరి పాత్రల్లో వాళ్లు ఒదిగిపోయి నటించారు. తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. డైరెక్టర్ నెల్సన్ వెంకటేశన్ మంచి కథను తెరకెక్కించారు. చాలా సహజంగా మన పక్కింటి వాళ్ళ జీవితాల్లా సినిమా సాగుతుంది. ఎక్కడా బోర్ కొట్టకుండా మూవీ బాగుంటుంది. తమిళం లో ఈ చిత్రాన్ని మ్యూజికల్ హిట్ గా నిలిపిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం తెలుగు లో కూడా శ్రోతలను ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులోని ‘చిలకా చిలకా’ పాట యువత ని బాగా ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియా సెన్సేషన్ పల్లె కోయిల ‘పసల బేబి’ ఈ పాటను పాపడటం విశేషం. ఈ చిత్రానికి అందించిన మల్లూరి వెంకట్ మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి.

పెళ్లి రోజు గురుంచి ఒక్క మాటలో చెప్పాలంటే.. నేటి యువతీ యువకుల జీవితాలు, వారి ఆలోచనలను ప్రతిబింబించేలా మూవీ ఉంది.

ఈక్షణం రేటింగ్: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*