లగడపాటి సర్వే ఫ్లాప్.. అంచనాలకు మైళ్ల దూరంలో ఫలితాలు

ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే ఈసారి తిరగబడింది. తెలంగాణలో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్న ఆయన జోస్యం అంచనాలు తప్పింది. ఎవరూ ఊహించని విధంగా టీఆర్ఎస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. మహాకూటమికి 65 స్థానాలకు అటూఇటుగా వస్తాయని లగడపాటి అంచనా వేయగా, ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆధిక్యం 20 స్థానాలు కూడా దాటలేదు. టీఆర్ఎస్ మాత్రం వంద స్థానాల దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్ దాదాపు అన్ని చోట్ల ఆధిక్యం కనబరుస్తోంది.

మరోవైపు, తెలంగాణలో టీఆర్ఎస్ విజయం సాధిస్తుందన్న జాతీయ మీడియా సంస్థల సర్వే నిజమైంది. అయితే, స్థానాల్లో కొంత తేడా ఉన్నప్పటికీ జాతీయ మీడియా అంచనాలు కరెక్టయ్యాయి. జాతీయ స్థాయి చానళ్లు దాదాపు అన్నీ టీఆర్ఎస్‌కు 65 స్థానాలు పక్కా అని చెప్పాయి. అయితే, వాటి అంచనాలను కూడా తెలంగాణ ఓటర్లు తలకిందులు చేశారు. టీఆర్ఎస్ ఇప్పటికే 88 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం.. టీఆర్ఎస్ 88, కాంగ్రస్ 16, బీజేపీ 4, ఎంఐఎం 6, ఇతరులు మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*