తెలంగాణలో నిశ్శబ్ద విప్లవం.. దూసుకుపోతున్న కారు

తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. మహాకూటమి పేరుతో ఒక్కటైన కాంగ్రెస్‌కు మరోమారు తెలంగాణ ప్రజలు షాకిచ్చారు. నిశ్శబ్ద విప్లవంతో టీఆర్ఎస్‌కు అండగా నిలిచారు. ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల ప్రకారం టీఆర్ఎస్ 88 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా, కాంగ్రెస్ 15, బీజేపీ 4, ఎంఐఎం 5, ఇతరులు 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్ఎస్ ఆధిక్యంలోనే ఉంది. అది క్రమంగా పెరిగి మెజారిటీ దిశగా దూసుకుపోతోంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెబుతున్నట్టు వందకు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామంటూ రెండు మూడు రోజులుగా హడావిడి చేసిన కాంగ్రెస్ ఆధిక్యం క్రమంగా పడిపోతోంది. టీఆర్ఎస్‌కు పట్టున్న అన్ని జిల్లాల్లోనూ ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక, టీఆర్ఎస్ మిత్రపక్షమైన ఎంఐఎం కూడా పోటీ చేసిన మొత్తం స్థానాల్లో ఆధిక్యాన్ని నిలుపుకుంది. చాంద్రాయణ గుట్టలో ఆ పార్టీ అభ్యర్థి అక్బరుద్దీన్ ఇప్పటికే విజయం సాధించగా, జగిత్యాలలో కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*