చంద్రబాబును నిరాశకు గురిచేసిన తెలంగాణ ఫలితాలు

తెలంగాణలో మహాకూటమి గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ప్రస్తుతం వస్తున్న ఫలితాలు తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఉండవల్లిలోని తన నివాసం నుంచి ఫలితాల సరళిని సమీక్షించిన చంద్రబాబు కూటమి ఓటమి ఖారైరనట్టు ఓ నిర్ణయానికి వచ్చారు. ఎవరితోనూ మాట్లాడకుండా రోజు వారీ కార్యక్రమాలకు వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు మరికాసేపట్లో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించనున్నారు.

మొత్తం ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ హవా కొనసాగిస్తుండగా, తెలంగాణలో మాత్రం చితికలపడింది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం తెలంగాణలో రెండోసారి టీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోంది. ఇప్పటి వరకు వెల్లడైన వివరాలను బట్టి టీఆర్ఎస్ 87, కూటమి 21, బీజేపీ 3, ఇతరులు మూడు, ఎంఐఎం ఐదు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*