బీజేపీకి భారీ షాక్.. నాలుగు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ హవా

మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్, మిజోరం ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి భారీ షాక్ తగిలింది. అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ వెనుకంజలో ఉంది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా, మిజోరంలో మొత్తం 40 స్థానాలకు గాను 27 స్థానాల్లో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) గెలుపు ఖరారైంది.

మధ్యప్రదేశ్‌లో 230 స్థానాలకు ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 104, బీజేపీ 94 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. ఇతరులు ఆరు చోట్ల, బీఎస్పీ నాలుగు చోట్ల ఆధిక్యంలో ఉంది. రాజస్థాన్‌లో 200 సీట్లకు కాంగ్రెస్ 90, బీజేపీ 76 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 18 చోట్ల, బీఎస్పీ అభ్యర్థులు 3 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు. చత్తీస్‌గఢ్‌లో మొత్తం 90 స్థానాల్లో ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్ 46, బీజేపీ 24, బీఎస్పీ 9, ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఇక, మిజోరంలో 40 స్థానాలకు గాను ఎంఎన్ఎఫ్ 27, కాంగ్రెస్ 7, ఇతరులు 5, బీజేపీ ఒక చోట ఆధిక్యంలో ఉన్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*