చంద్రబాబు కుటుంబంలో విషాదం

హైదరాబాద్: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కుటుంబంలో విషాదం అలముకుంది. ఆయన
మేనల్లుడు ఉదయ్‌ కుమార్‌ ఈ ఉదయం గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన ఉదయం ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలారు. దీంతో వెంటనే ఆయనను కేఆర్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమించడంతో మృతి చెందారు.

ఉదయ్ కుమార్ మృతి వార్త తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరారు. 43 ఏళ్ల ఉదయ్ కుమార్ చంద్రబాబు రెండో సోదరి హైమవతి కుమారుడు. ఉదయ్ కుమార్ మృతికి పలువురు తెలుగుదేశం నాయకులు సంతాపం తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*