రఫెల్ డీల్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు

న్యూఢిల్లీ: రఫెల్ యుద్ధ విమానాల ఒప్పందంపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఒప్పందంపై ఎలాంటి అనుమానాలు లేవని, ఒప్పంద ప్రక్రియ పారదర్శకంగా జరిగిందని తెలిపింది. ఒప్పందానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒప్పందంలో 36 పిటిషన్లను సుప్రీంకోర్టును కొట్టివేసింది. యుద్ధ విమానాల ధరలను దేశ రక్షణ దృష్ట్యా వెల్లడి చేయకూడదని కూడా సుప్రీం కోర్టు తెలిపింది. ధరల విషయాలను నిపుణులు చూసుకుంటారని, తాము జోక్యం చేసుకోబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

36 యుద్ధవిమానాలను 56వేల కోట్ల రూపాయలతో కొనుగోలు చేసేందుకు మోదీ సర్కారు ఫ్రాన్స్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. అనిల్ అంబానీకి లబ్ధి చేకూర్చేందుకే మోదీ నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అయితే ఒప్పంద ప్రక్రియను లోతుగా పరిశీలించిన సుప్రీంకోర్టు ఒప్పందంలో ఎలాంటి అనుమానాలూ లేవని స్పష్టం చేసింది.

వాస్తవానికి ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో రఫెల్ డీల్‌ను తప్పుబడుతూ మోదీ సర్కారుపై రాహుల్ గాంధీ తీవ్ర ఆరోపణలు చేశారు. చౌకీదార్ చోర్ హై అంటూ మోదీని దొంగ అంటూ రాహుల్ ప్రచారం చేశారు. మీడియా కూడా రాహుల్ ఆరోపణలను ప్రధానంగా ప్రస్తావించింది. ఒప్పందంపై కావాలనే తప్పుడు ప్రచారం చేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల సమయంలో ప్రజలను తప్పుదోవ పట్టించిన ప్రతిపక్షాలు ఆ విధంగానే లబ్ధి పొందాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తాను చేసిన అవినీతి ఆరోపణల ద్వారా రాహుల్ మూడు రాష్ట్రాల్లో తన పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. ప్రజలను రాహుల్ తెలివిగా తప్పుదోవ పట్టించి లబ్ధి పొందారని బీజేపీ నేతలు వ్యాఖ్యానించారు.

మరోవైపు రఫెల్ డీల్‌లో అవినీతి జరిగిందని రాహుల్ చేసిన ప్రకటనపై అనిల్ అంబానీ వేసిన పరువు నష్టం దావాపై తీర్పు వెలువడాల్సి ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*