సినీ నటి తారా చౌదరిని మోసం చేసిన బావ.. పోలీసులకు ఫిర్యాదు

హైదరాబాద్: సినీ నటి తారా చౌదరి (31) మరోమారు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. పెళ్లి పేరుతో బావే తనను మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసుల కథనం ప్రకారం.. తారా చౌదరికి వరుసకు బావ అయ్యే చావా రాజ్‌కుమార్, అతడి సోదరి సుజాతతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. దీంతో తన సోదరుడు రాజ్‌కుమార్‌ను వివాహం చేసుకోవాలంటూ తారా చౌదరిని సుజాత పలుమార్లు కోరింది.

దీంతో అతడికి గతంలోనే వివాహమైన విషయాన్ని తారా చౌదరి ప్రశ్నించింది. అయితే, అతడు ఇప్పుడు విడాకులు తీసుకుని ఒంటరిగానే ఉన్నట్టు సుజాత తెలిపింది. అయినప్పటికీ అతడిని వివాహం చేసుకోవడం ఇష్టం లేని తారా చౌదరి తన మకాంను విజయవాడకు మార్చింది. విషయం తెలిసిన రాజ్‌కుమార్ విజయవాడ వెళ్లి చుట్టుపక్కల వారితో తాను తార భర్తనంటూ పరిచయం పెంచుకున్నాడు. రాజ్‌కుమార్ తన భర్తగా అందరికీ పరిచయం కావడంతో విధిలేక పెళ్లికి అంగీకరించింది. తార అలా అడిగినప్పటి నుంచీ రాజ్‌కుమార్ తప్పించుకోవడం మొదలుపెట్టాడు. దీంతో రాజ్‌కుమార్ తనను మోసం చేశాడంటూ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*