ప్రేమించి పెళ్లాడి 12 ఏళ్ల తర్వాత భార్యను దారుణంగా హత్య చేసిన టీవీ విలేకరి

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను 12 ఏళ్ల తర్వాత దారుణంగా చంపేశాడో టీవీ చానల్ విలేకరి. పశ్చిమగోదావరి జిల్లాలోని బుట్టాయిగూడెంలో జరిగిందీ దారుణం. పోలీసుల కథనం ప్రకారం.. రెడ్డి గణపవరానికి చెందిన తడికమళ్ల లెనిన్, అంతర్వేది గూడేనికి చెందిన కొవ్వాసి సత్యవతి 12 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. లెన్ ఓ టీవీ చానల్‌లో విలేకరిగా పనిచేస్తుండగా, సత్యవతి ప్రభుత్వ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

లెనిన్-సత్యవతి మధ్య ఇటీవల విభేదాలు పొడసూపాయి. దీంతో మూడు రోజులపాటు సెలవు పెట్టిన సత్యవతి పుట్టింటికి వెళ్లింది. గురువారం ఇంటి నుంచి విధుల కోసం ఆసుపత్రికి వెళ్తున్న భార్య సత్యవతిని బస్టాండ్ వద్ద చూసిన భర్త లెనిన్ తన బైక్ ఎక్కమని కోరాడు. దీనికి ఆమె నిరాకరించింది. దీంతో బస్టాండ్ పక్కనే ఉన్న త్రిశక్తి పీఠం వైపు వస్తే మాట్లాడుకుందామని కోరాడు. సరేనన్న ఆమె అతడితో కలిసి వెళ్లింది. అక్కడ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కత్తి తీసి విచక్షణ రహితంగా పొడిచి పరారయ్యాడు. తీవ్ర రక్తస్రావమైన ఆమె అక్కడే ప్రాణాలు వదిలింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*