ఊహించని ఘటనతో చింతమనేని కన్నెర్ర..  కారు వదిలేసి బస్సులో వెళ్లిన ఎమ్మెల్యే 

గుంటూరు: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు ఊహించని ఘటన ఎదురైంది. కాజా టోల్ గేట్ సిబ్బంది చింతమనేని కారును ఆపేశారు. తాను ఎమ్మెల్యే అని చెప్పినా కారును పోనివ్వలేదు. టోల్ గేట్ సిబ్బంది తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. కారును టోల్ గేట్ వద్దే వదిలేసి బస్సు ఎక్కి వెళ్లిపోయారు.

ఎమ్మెల్యే చింతమనేని వ్యవహారంపై టోల్ గేట్ సిబ్బంది మాట్లాడుతూ ఎమ్మెల్యే కారుపై నెంబర్ లేదని చెప్పారు. ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా లేదన్నారు. చింతమనేని మంకీ క్యాప్ ధరించడంతో తాము గుర్తు పట్టలేకపోయామన్నారు. గన్ మెన్‌లను చూసిన తరువాత కారును పోనివ్వమని చెప్పామని గుర్తు చేశారు. అయితే ఎమ్మెల్యే ఆగ్రహం చెంది కారును అక్కడే వదిలి వెళ్లారని తెలిపారు. ఎమ్మెల్యే చింతమనేనికి తాము క్షమాపణ చెబుతున్నామని టోల్ గేట్ నిర్వాహకులు రవి కిరణ్, శాస్త్రీ తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*