చిన్నజీయర్ స్వామికి తృటిలో తప్పిన ప్రమాదం..

హైదరాబాద్: త్రిదండి చిన్నజీయర్ స్వామికి తృటిలో ప్రమాదం తప్పింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కొత్తపేటలోని అష్టలక్ష్మి దేవాలయంలో పూజలు నిర్వహిస్తుండగా తాళ్లు, కర్రలతో బిగించిన వేదిక కూలిపోయింది. ఆలయంలో ఎత్తైన ప్రదేశంలో చిన్నజీయర్ స్వామి పూజలు నిర్వహిస్తుండగా తాళ్లు తెగిపోయాయి. దీంతో పూజ చేస్తున్న చిన్న జీయర్ స్వామి వేదికపైనే పడిపోయారు. వేదిక కూడా కాసేపటికి కూలింది. అయితే తృటిలో ప్రమాదం తప్పింది. కొన్ని తాళ్లు తెగకుండా గట్టిగా ఉండటంతో ప్రమాదం తప్పింది. పరిమతికి మించి ఎక్కువ మంది వేదికపైకి ఎక్కడమే ప్రమాదానికి కారణమని తేల్చారు.

స్వామి పూజలు చేస్తుండగా పైనుంచి ఒక ప్లేట్ కింద పడిపోయి పెద్ద శబ్దం వచ్చింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో భక్తులంతా ఆందోళనకు గురయ్యారు. ఘటనలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మరొకసారి ఇలాంటి ఘటనలు తీసుకోవాలని అష్టలక్ష్మి దేవాలయ కమిటీ నిర్ణయం తీసుకుంది.

కోట్లాదిమంది తెలుగువారికి ఆరాధ్యులైన చిన్నజీయర్ స్వామి చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా అనేకమంది పేదలకు ప్రయోజనం చేకూరుతోంది. సీఎం కేసీఆర్, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ చిన్నజీయర్ స్వామి భక్తులే.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*