ఇండొనేషియాపై మళ్లీ విరుచుకుపడిన సునామీ.. తీవ్ర విధ్వంసం..

జకార్తా: పౌర్ణమి వేళ ఇండోనేషియాపై సునామీ మళ్లీ విరుచుకుపడింది. అనాక్ క్రకటోవా అగ్నిపర్వతం బద్దలై సునామీ సంభవించింది. సౌత్ సుమత్రా, వెస్ట్ జావా తీర ప్రాంతాలను రాకాసి అలలు ధ్వంసం చేశాయి. బీచ్‌ల వెంబడి ఉన్న హోటళ్లు, భవనాలు, పర్యాటక కేంద్రాలు సర్వనాశనమయ్యాయి.

తీరం వెంబడి సంగీత కార్యక్రమాల్లో పాల్గొన్న వారిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది గల్లంతయ్యారు. దృశ్యాలు భయానకంగా ఉన్నాయి. వందల మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సునామీ రాత్రిపూట సంభవించింది.

సుమత్రా దీవుల్లో కొన్నేళ్ల క్రితం సంభవించిన సునామీలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*