క్రిస్ట్‌మస్ వేళ జనసేనకు పండగలాంటి వార్త

జనసేన పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు పండగలాంటి వార్త వచ్చేసింది. పార్టీకి ఎన్నికల సంఘం గుర్తునిచ్చింది. చాయ్ తాగే గాజు గ్లాస్‌ను ఎన్నికల గుర్తుగా ఇచ్చింది. సామాన్యులకు నిత్యం అందుబాటులో ఉండే చాయ్ గాజు గ్లాసును సింబల్‌గా ఇవ్వడంపై పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమౌతున్నాయి. ప్రజల్లోకి సులభంగా తమ గుర్తును తీసుకెళ్లేందుకు సాధ్యమౌతుందని పండగ చేసుకుంటున్నాయి.

జనసేనాని యూరప్ పర్యటనలో ఉండగా ఈసీ నుంచి ఈ గుర్తు వచ్చింది. తనయుడు శంకర్ పవనోవిచ్ కోసం పవన్, లెజ్నోవా యూరప్ వెళ్లారు. క్రైస్తవ సంప్రదాయాలను అనుసరించి చేయాల్సిన కార్యక్రమాలూ పూర్తి చేసుకునేందుకు, క్రిస్ట్‌మస్ అక్కడే జరుపుకునేందుకు పవన్ యూరప్ వెళ్లారు.

ఎన్నికల సంఘం తమకు కేటాయించిన గుర్తును జనసేన అధికారిక ట్విటర్‌ ద్వారా వెల్లడించింది.

గుర్తును విజయవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడమే తరువాయి అని జనసేన శ్రేణులంటున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*