కుట్ర పాటపై చిక్కుల్లో వర్మ..

విజయవాడ: లక్ష్మీస్‌ ఎన్టీఆర్ సినిమా కోసం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కించపరుస్తూ కుట్ర పాట రూపొందించడంపై తెలుగు తమ్ముళ్లు మండిపడ్తున్నారు. దర్శకుడు రాంగోపాల్ వర్మపై ఏపీలో పలు చోట్ల కేసులు పెడుతున్నారు. విజయవాడలో వర్మ ఫ్లెక్సీలను దహనం చేశారు. ఒక్క వర్మనే కాదని కుట్ర పాట వెనుక కుట్రదారులను కూడా బయటకు తీసుకొస్తామని తెలుగుదేశం పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.

నందమూరి బాలకృష్ణ హీరోగా దర్శకుడు క్రిష్ కథనాయకుడు, మహానాయకుడు సినిమా తీస్తుండగా, ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటినుంచీ ఏం జరిగిందనే కోణాన్ని చూపిస్తామంటూ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తీస్తున్నారు. అయితే సినిమాలోని పాటలకు తమ అధినేత చంద్రబాబు ఫొటోలు  వాడుకోవడంపై తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది కూడా కథనాయకుడు, మహానాయకుడు సినిమా ఆడియో విడుదలకు కొద్దిసేపటి ముందు కుట్రపాటను యూ ట్యూబ్‌లో పెట్టడంపై టీడీపీ శ్రేణులు మండిపడ్తున్నాయి.

వాస్తవానికి రెండ్రోజుల క్రితమే వర్మ తన సినిమాలో ఏం ఉండబోతుందో ఓ వీడియో ద్వారా వెల్లడించారు.

వర్మ తీరుపై టీడీపీ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. ఆయన వెనుక అసలు కుట్రదారులు ఎవరనేది బయటపెట్టాలని టీడీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*