షామీర్‌పేట రేవ్ పార్టీ ఘటనలో సంచలన విషయాలు వెల్లడి

హైదరాబాద్: షామీర్‌పేట రేవ్ పార్టీలో మరో కోణం బయటకు వచ్చింది. డాక్టర్లకు రేవ్ పార్టీని ఓ ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసింది.
డాక్టర్లకు అమ్మాయిలను సరఫరా చేసింది. తమ వ్యాపారం పెంచుకునేందుకు ఔషధ తయారీ కంపెనీ ఇంతలా దిగజారడంపై పోలీసులు విస్మయం చెందుతున్నారు. నిన్న శామీర్‌పేట్‌లోని సెలబ్రిటీ రిసార్ట్‌లో రాత్రి జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. నలుగురు అమ్మాయిలు, ఏడుగురు డాక్టర్లను అరెస్ట్ చేశారు.

రేవ్ పార్టీకి వచ్చిన అమ్మాయిలకు హెచ్ఐవీ పరీక్షలు సైతం నిర్వహించినట్టు మెడికల్ కిట్ల ద్వారా పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో పట్టుబడిన వారు

1.ఓడేం చంద్రారెడ్డి
2.నాగం మునయ్య
3.దొంతుల రాజ్ కుమార్
4.మెరుగు సత్యనారాయణ
5.కొలిచెలిమి మహిపాల్
6.నందికొండ శ్రీనివాస్
7.అలిశాల లింగం

పట్టుబడ్డ నలుగురు అమ్మాయిలను రెస్క్యూ హోంకి తరలించారు. దర్యాప్తులో మరెన్ని సంచలన విషయాలు బయటకు రానున్నాయో మరి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*