కాకతీయ ఫిల్మ్ ఫెస్టివల్- 2018 లఘు చిత్రాల అవార్డుల ప్రదానోత్సవం నేడే!

హైదరాబాద్: సమాచార భారతి సాంస్కృతిక సంస్థ ‘ద్వితీయ కాకతీయ చలనచిత్రోత్సవం’ లఘు చిత్రాల ప్రదర్శనకు సంబంధించిన అవార్డుల ప్రదానోత్సవం నేడు జరుగనుంది. భాగ్యనగరంలోని మాదాపూర్ సీసీఆర్టీ(సెంట్రల్ ఫర్ కల్చరల్ రీ సోర్సెస్ అండ్ ట్రైనింగ్)లో సాయంత్రం 4:30గంటలకు జరగనున్నట్లు సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ అధ్యక్షులు గోపాల్ రెడ్డి, సెక్రటరీ ఆయుష్ నడింపల్లి, ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు, తెలంగాణ భాషా-సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ రానున్నారు. రిలయన్స్ గ్రూప్స్ లిమిటెడ్ మీడియా ప్రెసిడెంట్ ఉమేశ్ ఉపాధ్యాయ్, భారతీయ చిత్రసాధన జనరల్ సెక్రటరీ రాకేశ్ మిట్టల్ ఈ వేడుకకు హాజరుకానున్నారు.

భారతీయకు పునాదులైన సామాజిక బాధ్యత, కుటుంబ విలువలు, సామాజిక విలువలు పెంపొందించడం కోసం ఇటీవల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీకిగాను పలువురు తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో లఘు చిత్రాలు పంపించారు. మొత్తం లఘు చిత్రాల నిడివి 20 నిమిషాలు, డాక్యుమెంటరీ చిత్రాల నిడివి 30 నిమిషాలు మించకుండా పలువురు పోటీదారులు సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్‌కు పంపారు. న్యాయనిర్ణేతలు ఈ చిత్రాల్లో కొన్నింటిని ఎంపిక చేశారు.

ఉత్తమ డాక్యుమెంటరీ, ఉత్తమ క్యాంపస్ చిత్రానికి క్యాష్ అవార్డ్స్ ఇస్తారు.

Press Release

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*