టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరులపై నటి అపూర్వ కన్నెర్ర

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అనుచరులు తనను వేధిస్తున్నారంటూ నటి అపూర్వ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సామాజిక మాధ్యమాల్లో తనపై అసత్య ఆరోపణలు చేస్తూ, తనను మానసికంగా వేధిస్తున్నారని ఆరోపించారు. తనపై వారు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటైనా నిజమని తేలితే తనను నడిరోడ్డుపై ఉరితీయాలని కోరారు.

పదేళ్ల నుంచి తాను ఒకే ఫోన్ నెంబర్ వాడుతున్నానని, తన కాల్ లిస్ట్ చెక్ చేసుకోవచ్చని అపూర్వ చెప్పారు. చింతమనేనిపై తనకు ఎలాంటి ద్వేషమూ లేదని, ఆయన వెనుక ఉన్న వారే నీచ రాజకీయాలు చేస్తున్నారని అపూర్వ మండిపడ్డారు. తక్షణమే చింతమనేని అనుచరులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.

తక్షణమే  ఏపీ సీఎం చంద్రబాబు తగిన చర్యలు తీసుకోవాలని అపూర్వ కోరారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*