జనవరి మొదటి వారంలో “రణరంగం” విడుదల

హైదరాబాద్: ARC ఎంటర్టైన్మెంట్ పతాకం పై ఇళయరాజా సంగీత సారధ్యంలో శరణ్ .కె.అద్వైతన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “రణరంగం”.ఈ చిత్రాన్ని ఎ.ఆర్.శీనురాజ్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి మొదటి వారంలో విడుదల కానుంది.

చిత్ర నిర్మాత ఎ.ఆర్.శీనురాజ్ మాట్లాడుతూ “ఇదొక అన్ని కమర్షియల్ హంగులున్న యాక్షన్ చిత్రం.అల్లు అర్జున్ “హ్యాపీ” చిత్రంలో నటించిన కిషోర్ ఈ చిత్రంలో కథానాయకుడుగా నటించాడు.ఇళయరాజా గారి సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ.అన్ని హంగులతో ఈ చిత్రాన్ని జనవరి మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకరానున్నాం” అన్నారు.

కిషోర్,యజ్ఞాశెట్టి నటించిన ఈ చిత్రానికి సంగీతం:ఇళయరాజా,మాటలు:మల్లూరి వెంకట్, ఎడిటర్:సురేష్, కెమెరా:జెమిన్, పాటలు:వెన్నెలకంటి, నిర్మాత:ఎ.ఆర్.శీనురాజ్, దర్శకత్వం: శరణ్ .కె.అద్వైతన్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*