అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భర్తను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

హైదరాబాద్: టీసిఎస్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న నాగరాజు కట్టుకున్న భార్య అమూల్యను, కుమార్తె అన్వికను వదిలి రాధారాణి అనే యువతీతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు.విషయం తెలుసుకున్న భార్య మీడియా, పోలీసుల సాయంతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

ఘటన హైదరాబాద్ మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధి ద్వారక నగర్‌లో కలకలం రేపింది. నకిరేకల్‌కు చెందిన నాగరాజుతో 2007లో పెద్దల సమక్షంలో అమూల్యతో వివాహమైంది. ఆ తర్వాత వీరికి పాప పుట్టింది. అన్విక అని పేరు పెట్టుకున్నారు. పాపకు ప్రస్తుతం ఎనిమిదేళ్ల వయస్సు. ఇంత వరకూ కథ బాగానే ఉన్నా ఆరునెలల క్రితం నుంచి కథ మరో టర్న్ తీసుకుంది.

సీన్ కట్ చేస్తే

టీసిఎస్ కంపెనీలో టీమ్ లీడర్‌గా పనిచేస్తున్న నాగరాజు తనతో పాటు పనిచేసే రాధారాణి అనే యువతితో ఆరునెలలుగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. హస్తినపురం ద్వారక నగర్‌లో వేరే కాపురం పెట్టాడు. విషయం తెలుసుకున్న భార్య అమూల్య వారిద్దరిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని మీర్‌పేట్ పోలీసులుకు ఫిర్యాదు చేసింది.

నాగరాజును అరెస్ట్ చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో కూడా తనను, తన కుమార్తెను హత్యచేయడానికి నాగరాజు పథకం పన్నాడని అమూల్య ఆరోపించింది. భర్తతో తమకు ప్రాణ హాని ఉందని ఫిర్యాదులో పేర్కొంది. తన భర్తపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. అదే సమయంలో తనకు, తన కుమార్తెకు న్యాయం చేయాలని కోరింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*